ఫ్రెండ్స్ మనందరికీ కూడా కారు కొనడం అంటే చాలా పెద్ద కథ అయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా కారు కొనుక్కోవాలని ఆశిస్తూ మంచి మంచి కారులను కొనుగోలు చేసుకుంటున్నారు కానీ కారు కొనుగోలు చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకోకపోవటం వల్ల కానీ లేకపోతే తెలుసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ మనకి కొన్ని పెద్ద పెద్ద నష్టలైతే జరుగుతుంటాయి మరి దానిలో ఒకటి కార్ ఇన్సూరెన్స్ గురించిన అతి ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అందుకనే నేను ఒక చిన్న ఉదాహరణతో దీన్ని తెలుసుకుని మీకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తాను
Example Explaining About RTI Car Insurance
రమేష్ అనే వ్యక్తి తాజాగా 20 లక్షల రూపాయల కారును కొనుగోలు చేశాడు అయితే అతని కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు అతనికి 20 లక్షల రూపాయలను ఇవ్వటానికి నిరాకరించారు దీనికి గల కారణం ఏంటి అంటే ఇన్వాయిస్ ప్రైస్ కన్నా కూడా వాళ్ళు డిప్రిసేషన్ అని వేరే వేరే కారణాలవల్ల ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా కేవలం 13 లక్షలకు మాత్రమే రమేష్ కు ఇన్సూరెన్స్ అనేది వచ్చిందన్నమాట ఇక్కడ మనం కట్టింది 20 లక్షలు అయితే 13 లక్షలే ఇన్సూరెన్స్ రావడం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇక్కడే మనం చేయాల్సిన ఒక పెద్ద పని ఉంటుందండి. ఎప్పుడైనా సరే కొత్త కారు కొంటున్నప్పుడు ఆర్.టి.ఐ అని ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆర్టిఐ అనేదానికి కొద్దిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు గనక చెల్లించినట్లైతే మనకి ఒక రకంగా ఆర్టిఐ అంటే రిటర్న్ టు ఇన్ వాయిస్ అనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఇన్సూరెన్స్ వల్ల ఇస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మన కారుని ఎవరైనా దొంగలించిన లేదా మన కారు తగలడిపోయిన ఇంకా చెప్పాలి అంటే వేరే ఇతర ఏ కారణాల వల్ల అంటే కార్ ఆక్సిడెంట్ అయ్యి మొత్తం డామేజ్ అయిపోయి తుక్కుతుక్కుపోయిన కూడా ఇక ఇన్సూరెన్స్ వాళ్ళు మీరు ఎంతయితే కట్టారు అంటే రిజిస్ట్రేషన్ కానీ టాక్స్ కానీ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా డబ్బులను చెల్లిస్తారన్నమాట మరి విన్నారు కదా ఫ్రెండ్స్ . ఇకనుంచి మీరు కూడా కొత్త కారు కొనుక్కునేటప్పుడు ఈ విషయాలను పూర్తిగా గమనించి అన్నీ తెలుసుకొని కొత్త కారిని కొనుక్కోండి