ఫ్రెండ్స్ మనలో చాలామందికి మంచి కారు కొనుక్కోవాలన్నా ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చిన్నప్పటినుంచి చాలా మంచి కారులో తిరగాలని ఒక కోరిక అయితే ఉంటుంది అయితే సాధారణంగా కొంతమందికి ఆ ఒక్క కోరిక వెంటనే తీరిపోతుంది కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ఆ కోరిక తీరకుండా అలాగే ఉండిపోతుంది మనం మన చదువుని పూర్తిచేసుకుని ఉద్యోగం వచ్చిన వెంటనే ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి లేకపోతే ఇంకేదైనా సేవింగ్స్ చేసుకోవాలి లేదంటే పెట్టుబడి పెట్టుకోవాలి ఇలాగ రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. కాకపోతే మనకి జీతం పెరిగిన నెలవారి బోనస్ ఏదైనా వచ్చినా కూడా వెంటనే కారు గురించి ఆలోచిస్తాం. ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి రావాలి అంటే కచ్చితంగా ఒక మంచి కార్ మనకి అవసరం అయితే మంచి మైలేజ్ ఇచ్చేది మన బడ్జెట్లో ఉండేది అలాగే మన ఈఎంఐ అంతా కూడా సరిగ్గా దానికి సరిపోయేటట్టుగా ఒక కారు కొనుక్కోవాలని అనుకుంటా కానీ కారు ఎంతలో కొనుక్కోవాలి ఉదాహరణకి మన జీతం ఎంత మనం కారుకి తీసుకునే లోన్ ఎంత ఆ లోన్ ఈఎంఐ జీతం లో ఎంత భాగం ఉండాలి మిగతా ఖర్చులను మనం ఎలాగా చక్కగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం
Example Explaining About Buying New Car With Less Salary
ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పటికీ లేదా తన సొంత డబ్బులను తను సంపాదించుకుంటున్నప్పటికీ తను కారు కొనుక్కోవడానికి అర్హుడా అంటే కచ్చితంగా ఔనని చెప్పలే లేదా కాదని చెప్పలేం. ఎందుకని అంటే ఒక సగటు వ్యక్తి జీవితంలో కేవలం 20 నుంచి 30% వరకే అతను కారు మీద ఖర్చు పెట్టాలి. అలాంటప్పుడే ఒక వ్యక్తి కారు కొనుక్కున్నప్పటికీ కూడా తన మిగతా ఆర్థిక పరిస్థితులను ఎక్కడా కూడా పాడు చేసుకోకుండా చాలా చక్కగా సమకూర్చుకోగలడు. అంటే ఇప్పుడు మనం చక్కని ఉదాహరణతో దీని క్షుణ్ణంగా తెలుసుకుందాం. అది ఎలాగంటే ఒక వ్యక్తికి ఉదాహరణకి 40 వేల రూపాయల జీతం ఉందనుకోండి అయితే మరి అతను ఎంత కారుకి సంబంధించిన మంత్లీ అంటే నెలవారి వడ్డీ కట్టాలి నెలవారీ ఈఎంఐ ఎంత కట్టాలి అనేదే కదా మీ డౌట్ అంటే ఒక వ్యక్తికి 40,000 జీతం ఉంటే అతను కేవలం 20 శాతం మాత్రమే ఆయన తన జీవితంలో కారుకి ఖర్చు పెట్టాలి అంటే ఎనిమిది వేల రూపాయలు మాత్రమే కారు లోన్ ఈఎంఐ కి తను కట్టవలసి ఉంటుంది అంతకన్నా ఎక్కువ లోన్ తీసుకుంటే మాత్రం అతను తన ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు పడతాడన్నమాట అయితే 20 నుంచి 30% లోపే కారుకు సంబంధించిన ఈ EMI ఉండాలి ఒకవేళ మీ జీతం పెరిగినా కూడా పెట్రోల్ అనేది ఆ కార్ కి ఖర్చవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా 20 శాతాన్ని ఎప్పుడూ కూడా మించకూడదు 20 శాతం మనం కార్ కి ఖర్చు పెట్టుకోవచ్చు.