ఫ్రెండ్స్ కుటుంబంలో మనుషులు ఉండడం అలాగే మనుషులు అన్నాక ఆరోగ్య సమస్యలు రావడం సహజంగా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆరోగ్య సమస్యలకు ప్రస్తుతం ఇక హాస్పిటల్ లో వైద్యం అంటే అది తలకు మించిన భారమే. అయితే ఆ భారాన్ని తగ్గించుకోవడం కోసం మనందరం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అంటే ఆరోగ్య భీమా తీసుకుంటాం ఆరోగ్య భీమా అనేది కొంతమంది ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు మరి కొంతమంది కుటుంబ సమేతంగా తీసుకుంటూ ఉంటారు మరి కొంతమంది అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చే క్రమంలో వాళ్ళు కొంత తీసుకుని మిగతా కొంత ఏమో వాళ్ళ కంపెనీకి వదిలేస్తారు రకరకాలుగా ఆరోగ్య భీమా అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఆరోగ్య భీమా తీసుకునే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఆసుపత్రిలో చేరిన లేకపోతే ఆసుపత్రి బిల్లు అనేది లక్షల్లో అయినా కూడా మనకి ఆ సమయంలో ఆరోగ్య భీమా అనేది చాలా ఉపయోగపడాలి. అలాకాకుండా మనల్ని తప్పుదోవ పట్టించే లాగా కొంతమంది ఆరోగ్య బీమా చేయించే మీడియేటర్లు చాలా ఎక్కువగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు అప్పుడు మనం మోసపోతాం . సరైన సమయంలో సరైన ప్రీమియం కట్టి మనకి లాభం వచ్చేలాగా మన ఆరోగ్య భీమా అనేది ఉండాలి. అయితే ఆరోగ్యం భీమా తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అప్పుడు మనం ఆరోగ్య భీమాను తీసుకోవాలి మొదటిగా ఆరోగ్య భీమా లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి పది లక్షల రూపాయల ఆరోగ్య భీమా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనం హాస్పిటల్ లో ఉండే రూమ్ విషయంలో ఆరోగ్య భీమా ను అందించే సంస్థ చాలా ఎక్కువగా ఆంక్షలు పెడుతూ ఉంటారు అంటే మీ రూమ్ రెంట్ అనేది 5000 రూపాయలు దాటకూడదని లేదా మీ ఖర్చులు రెండు లక్షలు దాటకూడదని ఇలా వండుకొని ఆంక్షలు పెడుతుంటారు అయితే 10 లక్షల రూపాయల ఆరోగ్య భీమా నాకు ఉంది కదా అని చెప్పేసి ఎంత బడితే అంత రూమా మనం తీసుకుంటే మనకి ఆరోగ్య భీమా సంస్థ వాళ్ళు డబ్బు రుసుమును తిరిగి చెల్లించారు ఇక్కడ మనం ఒక ఉదాహరణతో ఈ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం
Explaining Health Insurance With Example
రమేష్ అనే వ్యక్తి హాస్పిటల్లో చేరాడు అయితే అతనికి ఎనిమిది లక్షల రూపాయల బీమా ఉంది అంటే 8 లక్షల రూపాయల వరకు అతను వాడుకోవచ్చు అనమాట సరే ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పి రూమ్ రెంట్ 10000 చొప్పున రోజుకి తీసుకోవడం జరిగింది. అయితే నాలుగు రోజుల పాటు ఆసపత్రిలోనే ఉన్నాడు అన్నీ సౌకర్యాలు చాలా చక్కగా పొందాడు అతని బిల్లు ఐదు లక్షల రూపాయలు అయింది సరే నాకు ఎనిమిది లక్షలు ఉన్నాయి కదా ఆ మొత్తం ఆరోగ్య సంస్థ బీమా వాళ్ళు ఇచ్చేస్తారులే అని అనుకున్నాడు కానీ అతనికి అక్కడే పెద్ద షాప్ తగిలింది అతనికి రెండున్నర లక్షలు చేతి డబ్బులు పడ్డాయి రెండున్నర లక్షల రూపాయలు అతను చేతికి డబ్బులు పడడం జరిగింది మరి విన్నారు కదండీ